*పసిప్రాయం నుండే క్రీడా ఆసక్తి కలిగించాలి
*జాతీయ క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్ :
పసిప్రాయం నుండే పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖమంత్రి వాటికి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే జాతీయ క్రీడ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,చిన్ననాటి నుండే విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం వారిని మైదానాల వైపు ప్రోత్సహించడం కుటుంబాలకు మాత్రమే కాకుండా దేశానికి సమాజానికి ఎంతో శ్రేయస్కరమని ఆయన అన్నారు మొక్కై వంగనిది మానై వంగదు అనే సామెత మాదిరిగా పసిప్రాయం నుండే క్రీడల్లో పట్ల శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడల్లో విజయాలు సాధించడమే కాకుండా ఆరోగ్యవంతులుగాతీర్చిదిద్దబడతారని ఆయన అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారి సహకారంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో దేశంలో ఏ రాష్ట్రము నిర్వహించనంత ఘనంగా జాతీయ క్రీడ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని, జాతీయ క్రీడా దినోత్సవం అని ఒక్క రోజుకే పరిమితం చేయకుండా తొమ్మిది రోజుల పాటు వివిధ వర్గాలను క్రీడల్లో భాగస్వామ్యం చేసే విధంగా అన్ని వయసుల వారికి వర్గాల వారికి వినూత్న కార్యక్రమాలు రూపొందించామని ఆయన అన్నారు. కేవలం హైదరాబాద్ నగరానికే కాకుండా జిల్లా కేంద్రాల్లో వివిధ విద్యాసంస్థల్లో ఈ క్రీడా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి రవీందర్ అనిత పి ఆర్ ఓ కాలేరు సురేష్ స్టేడియం అడ్మినిస్ట్రేటర్ మధు ఫ్యూచర్ ఒలంపియన్ నిర్వాహకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.