అధికార లాంఛనాల మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి

Facebook
X
LinkedIn

అమర వీరుని తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పార్థీవదేహాన్ని స్వయంగా మోసిన మంత్రి లోకేష్, దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలన

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రివర్యులు సత్యప్రసాద్, సవిత, అనిత, సత్య కుమార్ యాదవ్

పెనుకొండ :

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరియు రాష్ట్ర మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కళ్లితండాలోని నివాసం వద్ద మురళీ నాయక్ భౌతికకాయాన్ని సందర్శించి అశ్రు నివాళులు అర్పించారు. మురళీనాయక్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్ చేశారు. అనంతరం అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం, ఐటి శాఖ మంత్రి వర్యులు వారిని ఓదార్చారు.

అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ
కుటుంబానికి అండగా ఉంటాం క్యాబినెట్లో చర్చించి మురళీనాయక్‌ కుటుంబానికి ఐదెకరాల పొలంతో పాటు మరో 300 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. మురళీనాయక్ పార్థివదేహానికి నివాళులర్పించడానికి కళ్లితండాకు వచ్చిన పవన్ మురళీనాయక్‌ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా తమ మూడు పార్టీలు సిద్ధంగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేశారు. మురళీనాయక్‌ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్‌ ఆకాంక్షించారు.మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​, మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. అనంతరం ఐటి శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మురళీనాయక్‌ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మురళీనాయక్‌ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేశ్ అన్నారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కల్లితండాను మురళీనాయక్ తండాగా మారుస్తామని లోకేశ్ పేర్కొన్నారు. చిన్న వయసులో మురళీనాయక్‌ మృతి బాధాకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.స్వగ్రామంలో వీరజవాన్‌ మురళీనాయక్‌ అంత్యక్రియలు పూర్తి
అంతకు మునుపు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ మురళీ నాయక్ స్నేహితులు, బంధువులను పరామర్శించారు. యుద్ధానికి ముందు వీరజవాన్ మురళీ నాయక్ బంధువు, స్నేహితుడు రాజశేఖర్ తో జరిపిన వాట్సాప్ చాట్ ను మంత్రి పరిశీలించారు. మురళీనాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు. వీరజవాన్ మురళీ నాయక్ కు జై, భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ ప్రజలు, స్థానికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.


వీరజవాన్ మురళీ నాయక్ పార్థీవదేహాన్ని మోసిన మంత్రి లోకేష్

వీరజవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. మురళీ నాయక్ పార్థీవదేహాన్ని స్వయంగా మోసారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మురళీ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతకుముందు ఉదయం నుంచి వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి లోకేష్ దుగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవిత, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, మడకశిర ఎంఎస్ రాజు, కదిరి కందికుంట వెంకటప్రసాద్, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పి విరత్న, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.