చిన్న తరహా పరిశ్రమలకు రాంప్ చేయూత

Facebook
X
LinkedIn

తెలుగునాడు చర్లపల్లి :

ర్యాంప్ ద్వారా మైక్రోస్మా మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న తరహా పరిశ్రమలకు అన్ని రకాల సాంకేతిక సహాయ సహకారాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం అని, దీనిని అందరూ వినియోగించుకోవాలని
డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ (ఎం ఎస్ ఎం) కే మధుకర్ బాబు పారిశ్రామికవేత్తలకు సూచించారు. చర్లపల్లి సిఐఏ హాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక శాఖ, చర్లపల్లి పారిశ్రామిక సంఘం సహకారంతో నిర్వహించిన టెక్ ఎంక్లేవ్ లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కే మధుకర్ బాబు మాట్లాడుతూ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సి ఐ డి పి ఆధ్వర్యంలో ర్యాంప్ పథకంలో పరిశ్రమలకు సాంకేతిక సాయం మార్కెట్ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. కార్మికులకు ఉద్యోగులకు అవగాహన మరియు శిక్షణ కల్పిస్తుందని వివరించారు. చర్లపల్లి ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. సి ఐ టి డి ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ కాంత్, సిఐటిడి డిప్యూటీ డైరెక్టర్ జి శాంత్ కుమార్ ఐల చైర్మన్ రోహిత్ రెడ్డి, సిఐఏ సెక్రటరీ కె చంద్రశేఖర్ రెడ్డి, కాప్రా చిన్న తరహా పరిశ్రమ సమాఖ్య అధ్యక్షుడు యాదయ్య, సెక్రటరీ విద్యాసాగర్, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ సెక్రెటరీ సిహెచ్ బాబురావు, అధికారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.