టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యను ఖండించిన సిఎం చంద్రబాబు

Facebook
X
LinkedIn

అమరావతి :

సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేత, బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో వీరయ్య చౌదరి ఎంతో చురుగ్గా ఉండేవారిని..అలాంటి నేతను కోల్పోవడం విచారకరం అన్నారు. ఘటనపై జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో సిఎం మాట్లాడారు. పోలీసు అధికారులతోనూ మాట్లాడిన సిఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటామని సిఎం అన్నారు.