తెలుగునాడు, హైదరాబాద్ :
భారత సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టాన్ని కె. క్విన్సీ రత్న అద్భుతమైన ఘట్టాన్ని సాధించారు. హల్లేల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు ఆగస్టిన్ డి. వేణుగోపాల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సంగీత విభావరిలో, కేవలం ఒక గంట వ్యవధిలో 1,046 కీబోర్డ్ వాయిద్యం వాయిస్తున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌కి అప్‌లోడ్ చేసిన అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అరుదైన ఘనత ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నమోదు కావడం గర్వకారణమైన విషయం. సంగీతంలో ఉన్న ప్రావీణ్యత,సామర్థ్యాన్ని అలాగే డిజిటల్ సమన్వయాన్ని చాటి చెప్పే విశేష సందర్భంగా ఈ ఘటన నిలిచింది.

ఈ రికార్డు “ఒక గంటలో అత్యధిక మంది కీబోర్డ్ వాయిద్యం వాయిస్తున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన గరిష్ట సంఖ్య” కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™ గుర్తింపు పొందింది. ఇది సరైన ప్రణాళిక, సమయపాలన తో సాధ్యమే అత్యంత క్లిష్టమైన పని.
దేశవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులు ఈ వీడియో పట్ల అత్యంత ఆసక్తి కనబర్చారు.ఈ పోటీల్లో పాల్గొన్న కె. క్విన్సీ రత్న గారు యువ సంగీత ప్రపంచంలో ఒక నిష్ణాతులైన యువతిగా సంగీత ప్రపంచానికి ఒక గొప్ప ఖ్యాతిని చూపిన వ్యతిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆగస్టిన్ డి వేణుగోపాల్ మాట్లాడుతూ, “ఇది భారతదేశం యొక్క సంగీత భక్తికి ఓ గౌరవార్థం. దేశవ్యాప్తంగా నైపుణ్యాన్ని పంచుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గర్వకారణం” అని అన్నారు. ఇది సోషల్ మీడియా శక్తిని, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో కీలకం కానుందన్నారు . ఈ రికార్డులో భాగమవడం ద్వారా కె. క్విన్సీ రత్న గారు తమ కళా ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారనీ పేర్కొన్నారు. ఈ తల్లిదండ్రులు కిషోర్ , ప్రగతి లు తమ కూతురు ఇలా విశేష ప్రతిభ కనబరచడం వల్ల సంతోషం వ్యక్తం చేశారు.