తెలుగునాడు, విజయవాడ :
దక్షిణ భారతదేశంలోని కుటుంబాలలోని అన్ని తరాలవారి అభిరుచులనూ ప్రతిబింబించే విశ్వసనీయ బ్రాండ్ ఆర్.ఎస్. బ్రదర్స్ , శుక్రవారం విజయవాడలో రెండవ షోరూమ్‌కు శుభారంభం చేసి, తమ రిట్కెల్ ప్రయాణంలో కీలకమైన మరో ఘట్టాన్ని నమోదు చేసుకుంది. పి.వెంకటేశ్వరులు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు మరియు కీ.శే పి.సత్యనారాయణ దూరదృష్టితో స్థాపించిన ఆర్.ఎస్. బ్రదర్స్ సంప్రదాయం, శైలి, మరియు సరసమైన ధరల సమ్మేళనంతో కుటుంబంలోని అన్ని తరాల వారికి అద్భుతమైన షాపింగ్ అనుభూతిని అందించడంలో అగ్రశ్రేణిలో ఉంటోంది.

ఏప్రిల్ 18వ తేది శుక్రవారం జరిగిన ఈ ప్రారంభోత్సవం ఫ్యాషన్, సాంస్కృతిక విలువలు, మరియు ఉత్సవ శోభను ప్రతిబింబించింది. విజయవాడ లోక్‌సభ సభ్యులు కేశినేని చిన్ని, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలాస్వామి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, ఆర్.ఎస్. బ్రదర్స్ వారు తెలుగు రాష్ట్రాల్లో రిట్కెల్ రంగానికి అందిస్తున్న సేవల గురించి ప్రోత్సాహకరంగా ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా, జాతీయ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ నటీమణి కీర్తి సురేష్ విచ్చేసి, జ్యోతి ప్రజ్వలనతో మంగళప్రదమైన శుభారంభాన్ని అందించారు. అనంతరం ఆమె- ఆర్.ఎస్ బ్రదర్స్ వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన రెండవ షోరూమ్‌లోని వైవిధ్యభరితమైన వస్త్రశ్రేణిని సందర్శించి, ‘‘విజయవాడ, ఆ పరిసరాల్లోని షాపింగ్ ప్రియులు ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వేడుకలకు అనువైన షాపింగ్ కోసం ఈ షోరూమ్‌ను తప్పక సందర్శించాలని, ఇక్కడి షాపింగ్ అనుభూతిని గుర్తుండిపోయే ఘట్టంగా హృదయాల్లో పదిలపరచుకోవాల’’ని అన్నారు.

విజయవాడ బీసెంట్ రోడ్ క్రాస్, ఏలూరు రోడ్లో ఏప్రిల్ 18న శుభారంభం జరుపుకున్న ఆర్.ఎస్. బ్రదర్స్ సరికొత్త షోరూమ్- రానున్న పెళ్ళి సంబరాలకు ఆహ్లాదకరమైన కొత్త కలెక్షన్లను సిద్ధం చేసింది. ఇందులో మహిళలు, పురుషులు, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన వివాహ కలెక్షన్లలో అన్నిరకాల వస్త్రశ్రేణులూ షాపింగ్ ప్రియుల్ని తప్పక అలరిస్తాయి. విలాసవంతమైన కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, పెట్టుడు చీరలు, నక్షత్రాల్లాగా అల్లిన లెహంగాలు, సొగసైన షెర్వాణీలు, ఉత్సవ కుర్తాలు, ముద్దుగా కనిపించే కిడ్స్‌వేర్… ఇలా ఎన్నో రకాల ఫ్యాషన్ ఎంపికలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధరలు కూడా కేవలం రూ.150 నుంచి ఉండటం విశేషం. బడ్జెట్ ఏద్కెనా, ప్రతి ఒక్కరికి తగిన దుస్తులు ఇక్కడ లభిస్తాయి.
ఆర్ఎస్బి రిట్కెల్ ఇండియా లిమిటెడ్ డ్కెరెక్టర్లు పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్‌లో తమ బ్రాండ్ వేగంగా విస్తరిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబానికి శ్రేష్ఠమైన, నాణ్యమైన దుస్తులను సాంస్కృతిక విలువలు కలగలిపిన శై లిలో అందించాలన్నదే తమ లక్ష్యమని వారు తెలిపారు. ఆధునిక ధోరణులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న తమ ప్రయాణాన్ని వారు వివరించారు.

ఈ నూతన ప్రారంభోత్సవం ద్వారా ఆర్.ఎస్. బ్రదర్స్ తమ కస్టమర్ల నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. ఓవైపు నాలుగు లక్షలకుపైగా వైవిధ్యభరితమైన మోడళ్ళు విజయవాడ షాపింగ్ ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. సంప్రదాయ వస్త్రాలు, పెట్టుడు చీరలు, పండుగలకై ప్రత్యేక కలెక్షన్లు, పాశ్చాత్య వస్త్రాలు, బ్రాండెడ్ మెన్స్‌వేర్ తదితరాలన్నీ అందుబాటులో ఉండి, ప్రతి సందర్భాన్ని మరపురాని అనుభూతిగా మార్చే విధంగా, అత్యంత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వస్త్రసంపద మీకోసం ఎదురుచూస్తోంది.
పెళ్ళి వేడుకలకు సిద్ధమవుతున్నా, కుటుంబానికి షాపింగ్ చేస్తున్నా ఇదే సరైన సమయం! ఆర్.ఎస్. బ్రదర్స్ మీ ఫ్యాషన్, సంప్రదాయం, ఉత్తమ విలువలకు సవినయంగా స్వాగతం పలుకుతోంది! పండుగలా సాగే సరదా షాపింగ్ అనుభూతి కేవలం బీసెంట్ రోడ్ క్రాస్, ఏలూరు రోడ్, విజయవాడ ఆర్.ఎస్. బ్రదర్స్‌లో మాత్రమే.