మహాత్మా గాంధీ వాడిన చరకాన్ని తిప్పిన సీఎం రేవంత్ రెడ్డి
తెలుగునాడు, అహ్మదాబాద్
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ సబర్మతీ ఆశ్రమం సందర్శించి జాతిపిత మహాత్మ గాంధీ గారికి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మాగాంధీ గారి జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో గాంధీ గారు వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు.