తెలుగునాడు, మీర్పేట హెచ్ బి కాలనీ :
సంక్రాంతి పండుగ మానవుల మధ్య స్నేహాన్ని, కుటుంబ విలువలను పెంచుతుంది. ఈ పండుగ కుటుంబ సమావేశాలు, గ్రామాల్లో ప్రత్యేకమైన ఉత్సవాల ద్వారా అందర్నీ ఏకతాటిపైకి తెస్తుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఒకానొక ఉత్సాహాన్ని అందించే పండుగ సంక్రాంతి అని హౌసింగ్ బోర్డ్ కార్పొరేటర్ జె ప్రభుదాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంక్రాంతి పండుగ మన జీవితాలలో ఆనందాన్ని, శాంతిని, నూతన విజయాలను తీసుకురావాలని ఆశిస్తూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాని, ప్రకృతి మాతను గౌరవిస్తూ, సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, ప్రేమను పెంపొందిద్దాం మని పిలుపునిచ్చారు. పండుగ ఆనందం అందరికీ చేరాలని, మన జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కార్పొరేటర్ జే ప్రభుదాస్ తెలిపారు.