బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai)కు ఆరాధ్య అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రెండో సంతానం గురించి స్పందించారు.

By Entertainment Team Updated : 09 Dec 2024 15:50 IST

ముంబయి: నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘కేస్ తో బనతా హై’. తాజాగా ఈ కార్యక్రమంలో నటుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) పాల్గొన్నారు. ఇందులో ఆయనకు రెండో సంతానం గురించి ప్రశ్న ఎదురైంది. ‘‘ఆరాధ్య తర్వాత ఏమిటి?’’ అని రితేశ్ ప్రశ్నించగా అభిషేక్ నవ్వులు పూయించారు. ‘‘రితేశ్ పెద్దవాళ్లను గౌరవించాలి. నేను నీకంటే పెద్దవాడిని’’ అని ఇలాంటి ప్రశ్నలు పబ్లిక్‌గా అడగటం కరెక్ట్ కాదు అన్నట్లు బదులిచ్చారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య, ఆరాధ్య.. ఇలా పేరులో మొదటి అక్షరం A అనేది తమ కుటుంబంలో ఒక సంప్రదాయంగా మారిందన్నారు.
2007లో అభిషేక్ – ఐశ్వర్యల వివాహం జరిగింది. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఐశ్వర్య వల్లే తాను వర్క్ లైఫ్‌పై ఫోకస్ పెట్టగలుగుతున్నానని ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ చెప్పారు. ఆమె ఇంట్లోనే ఉండి కుమార్తె యోగక్షేమాలు చూసుకుంటుందని.. అందువల్లే తాను వర్క్‌పై ఫోకస్ చేయగలుగుతున్నానని అన్నారు. అందుకు ఆమెకు థాంక్యూ కూడా చెప్పారు. గత కొంతకాలంగా ఈ దంపతుల గురించి వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. వాటికి ఫుల్స్టాప్ చెబుతూ రెండు రోజుల క్రితం వీరిద్దరూ ఒక ఫంక్షన్లో కలిసి పాల్గొన్నారు.
సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ను నిందించడం హాస్యాస్పదం: వర్మ
వారిపై అమితాబ్ మరోసారి అసహనం
తన కుమారుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ గురించి పలు కథనాలు చక్కర్లు కొడుతోన్న సమయంలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అసత్య ప్రచారాలు చేసేవారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బుద్ధి లేని వారు లేదా మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారికి ఈ ప్రపంచంలో కొదవే లేదు. తమ వ్యక్తిగత జీవితాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటివారి గురించి ప్రతిరోజూ ఏదోఒక అసత్య ప్రచారం చేస్తూనే ఉంటారు. ముద్రిస్తూనే ఉంటారు’’ అని పేర్కొన్నారు. అమితాబ్ ఈవిధంగా అసహనం వ్యక్తంచేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ ఆయన బ్లాగ్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నా కుటుంబం గురించి అరుదుగా మాట్లాడుతుంటా. ఎందుకంటే అది నా సామ్రాజ్యం. దాని గోపత్యను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అసత్య ప్రచారాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పూర్తి సమాచారం తెలుసుకోకుండా అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుంటారు. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది నిజమైన వృత్తి ధర్మం’’ అని అన్నారు.