ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :
హైదరాబాద్‌లోని ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు మానవతా దృక్పథంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అవసరమైన నిరుపేదలు, వృద్ధులు, కార్మికులు మరియు పేద కుటుంబాలకు ప్రేమతో, గౌరవంతో భోజనం అందజేశారు. సమాజంలో ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం గొప్ప సేవ అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, “మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని సంస్థ ఎక్సగ్యుటీ మెంబెర్ జి.మాధవి తెలిపారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.
ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సమాజ సేవలో భాగంగా ఆరోగ్య, విద్య, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోంది.