దేశంలో విద్యావిధానాన్ని వ్యాపారంగా మార్చింది బీజేపీ సర్కార్

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :
దేశంలో విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
హైదరాబాద్ బోయినపల్లిలో జరిగిన ఛత్రోంకి గూంజ్ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ తో పాటు, కార్యక్రమ కన్వీనర్, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే గణేష్, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ…ఉద్యోగ, విద్యా పోటీ పరీక్షల పేపర్లను లీక్ చేస్తూ, విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటం అడ్డుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడం లేదని, కేంద్రం ఆయనపై చర్యలు ఏమీ తీసుకోవడం లేదన్నారు.
అందుకే ఈ ఉద్యమంతో కేంద్రం పై ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమం రాహుల్ గాంధీ చేపట్టారని చెప్పారు, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.