ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నెమలి అనిల్ కుమార్

Facebook
X
LinkedIn

నాచారం, :

నాచారంలోని తెలంగాణ ఫుడ్స్‌లో నూతన బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddyను గ్రేటర్ కాంగ్రెస్ నేత, ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన నెమలి అనిల్ కుమార్, రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. నాచారంలో ఏర్పాటు చేసిన నూతన బాలామృతం ప్లాంట్ ద్వారా చిన్నారుల పోషకాహార కార్యక్రమాలకు మరింత బలోపేతం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బాలామృతం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన పోషకాహారం అందించేందుకు ఈ ప్లాంట్ దోహదపడనుంది.