శోభన్ బాబు సతీమణి శాంతకుమారికి ఘన నివాళులు

Facebook
X
LinkedIn

అభిమానుల్లో విషాదం: భట్టిప్రోలు శ్రీనివాసరావు

భీమవరం, :

ప్రముఖ నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (89) చెన్నైలో కన్నుమూయడం పట్ల అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు భట్టిప్రోలు శ్రీనివాసరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. 1958 మే 15న శోభన్ బాబు, శాంతకుమారి వివాహం జరిగిందని, వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా విశేష గుర్తింపు పొందిన శోభన్ బాబు 2008లో గుండెపోటుతో మరణించారని గుర్తుచేశారు.

ఆయన మరణానంతరం శాంతకుమారి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె మరణం శోభన్ బాబు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.

శాంతకుమారికి ఘన నివాళులు అర్పించిన భట్టిప్రోలు శ్రీనివాసరావు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బొండా రాంబాబు, కారుమూరి భాస్కరరావు, లోయ బెనర్జీ, అడ్డాల సత్యనారాయణ, పెదపాటి రాజబాబు, కంచర్ల భాస్కరరావు గుప్త తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.