ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ డివిజన్ కమిటీ అధ్యక్షుల నియామకం

Facebook
X
LinkedIn

హైదరాబాద్:

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులను నియమించినట్లు నియోజకవర్గ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీజీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్తో సంప్రదించి ఈ నియామకాలకు ఆమోదం లభించినట్లు తెలిపారు.

కొత్తగా నియమితులైన డివిజన్ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత పటిష్ఠంగా నిర్మించే దిశగా పనిచేయాలని పరమేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

డివిజన్ అధ్యక్షుల జాబితా

  • 13వ డివిజన్ (వంపుగూడ) – కావలి అనూప్ రాజ్ యాదవ్
  • 14వ డివిజన్ (కాప్రా) – టి. శ్రీహరి
  • 15వ డివిజన్ (ఏఎస్ రావు నగర్) – కేశెట్టి ప్రసాద్
  • 16వ డివిజన్ (కుషాయిగూడ) – కౌకుట్ల ప్రకాశ్ రెడ్డి
  • 17వ డివిజన్ (చర్లపల్లి) – బొడిగ ప్రభు గౌడ్
  • 18వ డివిజన్ (శక్తి సాయినగర్) – వడ్లకొండ కృష్ణ
  • 19వ డివిజన్ (హెచ్‌బీ కాలనీ) – పోలిపాక ఆంజనేయులు
  • 20వ డివిజన్ (మల్లాపూర్) – జమీలా బేగం
  • 21వ డివిజన్ (నాచారం) – నూతలకంటి రాజు
  • 22వ డివిజన్ (హెచ్‌ఎంటీ నగర్) – వరకాల మహేష్ యాదవ్
  • 23వ డివిజన్ (చిలుకానగర్) – నల్లవెల్లి మహేందర్ ముదిరాజ్
  • 24వ డివిజన్ (బీరప్పగడ్డ) – ఆకిటి అగం రెడ్డి
  • 25వ డివిజన్ (హబ్సిగూడ) – కంది శ్రవణ్ కుమార్ రెడ్డి
  • 26వ డివిజన్ (రామంతాపూర్) – పెద్దిరాజు సందీప్ కుమార్
  • 27వ డివిజన్ (వెంకట్ రెడ్డి నగర్) – నామ్ రాజి రెడ్డి
  • 28వ డివిజన్ (ఉప్పల్) – ఈగ ఆంజనేయులు ముదిరాజ్

ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీ విస్తరణ, కార్యకర్తల సమన్వయం మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ కొత్త కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.