కుషాయిగూడలో ‘అరోమాజ్’ ఘనారంభం

Facebook
X
LinkedIn

ఉప్పల్, :

కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అరోమాజ్ బేకరీ అండ్ రెస్టారెంట్’ ఘనంగా ప్రారంభమైంది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రెస్టారెంట్‌లోని వివిధ విభాగాలను సందర్శించి అక్కడ కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర శివార్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కుషాయిగూడ, కాప్రా ప్రాంత ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార సేవలు అందించడంలో ఈ సంస్థ ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో కొత్త సంస్థల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. నిర్వాహకులు వెంకట్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను అభినందించారు.

అరోమాజ్‌లో హైదరాబాద్ సంప్రదాయ దమ్ బిర్యానీతో పాటు వివిధ రకాల చికెన్, మటన్ బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. చైనీస్, కాంటినెంటల్, ముగ్లాయ్ వంటకాలతో పాటు తందూరి ఐటమ్స్, కబాబ్స్, నాన్స్, స్టార్టర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

బేకరీ విభాగంలో తాజా పఫ్స్, పేస్ట్రీలు, బ్రెడ్స్, డెజర్ట్స్‌తో పాటు బర్త్‌డేలు, ప్రత్యేక వేడుకల కోసం కస్టమైజ్డ్ కేకులు అందుబాటులో ఉంచారు. నిపుణులైన చెఫ్‌ల పర్యవేక్షణలో పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ముడిపదార్థాలతో రుచికరమైన, హైజీనిక్ ఆహార పదార్థాలు, బేకరీ ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు వెంకట్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, ప్రభుదాస్, గొల్లూరి అంజయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.