కరెంట్ వైర్ తెగి ఇద్దరి మృతి

Facebook
X
LinkedIn

మృతుల కుటుంబాలకు ఈటల రాజేందర్ సానుభూతి

బాధితులకు తక్షణ సాయం అందించాలి

హైదరాబాద్, :

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని టెలికాం కాలనీలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాల భద్రత విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ విద్యుత్ లైన్లు, చెట్లు, ప్రమాదకర ప్రాంతాలపై ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఈటల రాజేందర్, ప్రభుత్వం వెంటనే తగిన ఆర్థిక సాయం ప్రకటించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ, జీహెచ్‌ఎంసీ, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.