టెహ్రాన్ :
అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో జరుగుతున్న యుద్ధం ఆగాలంటే ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసోద్ పెజెష్కియాన్ దీని గురించి తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. అమెరికా కూటమితో ఎటువంటి ఒప్పందం జరిగినా.. ఇరాన్ సహజ హక్కులను గుర్తించాలని పెజెష్కియాన్ అన్నారు. రష్యా, పాకిస్థాన్ నేతలతో ఈ అంశం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలంటే కొన్ని అంశాలు కీలకమైనవని ఆయన అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో యుద్ధం ముగియాలంటే మూడు అంశాలు ముఖ్యమైనవని పెజెష్కియాన్ తెలిపారు. ఇరాన్ హక్కుల్ని గుర్తించడం, నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయబోమనన్న గ్యారెంటీ ఇవ్వాలని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై ఆకస్మికంగా జరిపిన దాడిలో.. ఆ దేశ సుప్రీంనేత ఖమేనీతో పాటు అనేక మంది కీలక నేతలు హతమయ్యారు.అయితే ఆ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లను పేల్చివేయడంతో ఆ ప్రాంతం అగ్నిగుండంగా మారింది.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.