హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

తెలంగాణ ఉద్యమకారులకు పెంక్షన్, ఇంటి స్థలాలు, స్వతంత్ర సమరయోదుల గుర్తింపు కార్డు, ఇతర ఇచ్చిన హామీలను 8 వారాల లోపు అమలు చేయాలని గత నెల 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల దళిత ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు కర్రే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి పి.రామన్నతో కలసి ఆయన మాట్లాడారు.గత తెలంగాణా ఉద్యమాలను నెమరేసుకుందాం, తెలంగాణా ఉద్యమకారుల హక్కులను సాధించుకుందాం అనే నినాదంతో రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో 119 మంది ఎమ్మెల్యేలకు, అలాగే మిలియన్ మార్చ్ లో ఈనెల 10 నుండి 33 జిల్లాల కలెక్టర్లకు మెమోరండం అందజేస్తామన్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో ఉద్యమకారులతో, ప్రజా సంఘాలతో బహిరంగ సభనిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ఉద్యమకారుల కార్యాలయాన్ని ఐదెకరాల్లో ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ టి.ఎన్.వంశి  తిలక్, బాలయ్య, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.