భారీ పేలుడు.. 20మంది మృతి

Facebook
X
LinkedIn

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

కాకినాడ :

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. 20మంది మృతి చెందారు. ఘటన జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణా సంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడుతో అగ్నిప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని నివాసాలు ధ్వంసమయ్యాయి. పరిశ్రమ చుట్టు పక్క గ్రామాల్లో దట్టంగా పొగ అలముకుంది. పేలుడు సమయంలో30 మంది ఉన్నట్లు సమాచారం. చెల్లాచెదురుగా పంటపొలాల్లో మృతదేహాలు పడి ఉన్నాయి. 15 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.