ఉప్ప‌ల్ ప్రెస్ క్ల‌బ్‌(పి,ఈ) ఆధ్వ‌ర్యంలో..ఘ‌నంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

Facebook
X
LinkedIn

జర్నలిస్టులకు ఘ‌న సన్మానం

ఉప్ప‌ల్ :

ఉప్ప‌ల్ ప్రెస్ క్ల‌బ్‌( ప్రింట్అండ్ ఎలక్ట్రానిక్ ) ఆధ్వ‌ర్యంలో ఆదివారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. చిలుకాన‌గ‌ర్‌లోని నోవా బ్లాంకెట్ హాల్‌లో ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడు వ‌డ్డెప‌ల్లి కిషోర్‌ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ఉప్పల్ నియోజకవర్గ బీసీ జేఏసీ నాయకులు నేర్ధం భాస్క‌ర్‌గౌడ్‌, చిల్కానగర్ సీనియర్ బిఆర్ఎస్ నాయకులు జ‌ల్లి మోహ‌న్ లు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా జర్నలిస్టులను ఘనంగా సన్మానించి మెమొంటో డైరీ లను అందజేసి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ నాయ‌కులు నేర్ధం భాస్క‌ర్‌గౌడ్‌, జ‌ల్లి మోహ‌న్ లు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. నిజాలను వెలికితీసి ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని, వారి సేవలు సమాజానికి ఎంతో విలువైనవని అభినందించారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.ఈ సందర్భంగా పలు రంగాల్లో విశేష కృషి చేసిన జర్నలిస్టులకు శాలువాలతో ఘ‌నంగా స‌త్క‌రించారు. మెమంటోల‌ను, డైరీల‌ను అంద‌చేశారు. కొంతమంది సీనియర్ పాత్రికేయులు తమ అనుభవాలను పంచుకుంటూ, యువ జర్నలిస్టులు నిజాయితీతో, బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆనంద నర్సింహారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ లు పయ్యావుల సంతోష్, కీర్తి సంతోష్, జిఎస్ నాగరాజు లతోపాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.