ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఏడుగురు మృతి

Facebook
X
LinkedIn

అహ్మదాబాద్‌ :

ఘాట్‌ రోడ్డులో ఒక కారును లారీ ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆ కారు ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణించిన ఏడుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.   గుజరాత్‌లోని వాస్లాడ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కర్పాడలోని కుంభ్‌ఘాట్ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారును ఒక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆ కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఆ కారు నుజ్జునుజ్జు అయ్యింది.కాగా, కారులో ప్రయాణించిన ఏడుగురిలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రికి తరలించగా మరో ఇద్దరు అక్కడ చనిపోయారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.మరోవైపు మృతులను అంబా జంగిల్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. నానా పోండాకు కారులో వారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.