మహానీ యుల  ఆశయ సాదనే బీసీ జాగృతి సేన లక్ష్యం

Facebook
X
LinkedIn

నాగర్ కర్నూల్ :

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోని బీసీ బాలుర కళాశాల హాస్టల్ లో  బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ ఆద్వర్యం లో పూలె, అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా  బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ మహా నీయుల  జయంతి మాసం లో భాగంగా నేడు నాగర్  కర్నూల్  జిల్లా  కేంద్రం లో  పూలె, అంబేద్కర్ జయంతిని నిర్వహించామని తెలిపారు.  అణగారిన ప్రజల బ్రతుకు ల్లో అక్షర జ్యోతి వెలిగించిన పూలె జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువు లు  చదివిన తర్వాత గొప్పగా జీవించే అవకాశం ఉన్నా షెడ్యూల్ కులాల ప్రజల తో పాటు దేశ ప్రజలకు రాజ్యాంగం ద్వారాస్వేచ్చ, సమానత్వం, హక్కులు కల్పించారని అన్నారు,రెండవ మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ కృషి ఫలితం గా నే బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్ లు అమలు అయ్యాయని,, ముగ్గురు మహనీయుల ఆశయ సాధన కై  నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీసీ జాగృతి సేన రాష్ట్ర కార్యదర్శి రఘు నందన్ చారీ.ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్, విద్యార్థి సంఘము జిల్లా అధ్యక్షులు వెంకటేష్, మౌలానా,అభిషేక్, శివకుమార్, శ్రీకాంత్, శ్రీను, చరణ్, శివ, జస్వంత్, అంజి, వంశీ, అజయ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.