ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఎస్‌ఐలు మృతి

Facebook
X
LinkedIn

బెంగళూరు :

ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఎస్‌ఐలు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ ప్రాంతం చెళ్లకెర తాలూకాలోని బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగావతి ప్రాంతానికి చెందిన మంజునాథ్, సింధనూర్‌కు చెందిన అంబరీశ్ బార్గీ, తీర్థహళ్లికి చెందిన సచిన అనే ముగ్గురు పోలీసులు కర్నాటక రిజర్వు పోలీస్ దళంలో ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు ఎస్‌ఐలు తన స్నేహితుడిని పెళ్లికి హాజరయ్యేంపదకు కారులో బయలుదేరారు. హగ్గరే గ్రామ శివారులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఎస్‌ఐలు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చిత్రదుర్గ ఎస్‌పి రంజిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఝార్ఖండ్ కు చెందిన ట్రక్కు తుముకూర్ నుంచి బళ్లారిలోని జిందాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.