భౌతిక‌శాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి

Facebook
X
LinkedIn

స్టాక్‌హోమ్‌ :

ఈ ఏడాది భౌతిక‌శాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. జాన్ క్లార్క్‌, మైఖేల్ హెచ్ దేవ‌రేట్‌, జాన్ ఎం మార్టినిస్‌ల‌కు సంయుక్తంగా అవార్డును ప్ర‌క‌టించారు. ఎల‌క్ట్రిక్ సర్క్యూట్‌లో సంభ‌వించే ఎన‌ర్జీ క్వాంటిజేష‌న్‌పై చేప‌ట్టిన డిస్క‌వ‌రీకి గుర్తింపుగా వారిని ఈ పుర‌స్కారం వ‌రించింది. ఓ చిప్‌పై నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల ద్వారా క్వాంట‌మ్ ఫిజిక్స్ గురించి ఆ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. క్వాంట‌మ్ మెకానిక‌ల్ ట‌న్నెలింగ్ గురించి కూడా ఎల‌క్ట్రిక్ స‌ర్క్యూట్ ద్వారా ప‌రీక్షించారు. క్వాంట‌మ్ మెకానిక‌ల్ ల‌క్ష‌ణాల గురించి మాక్రోస్కోపిక్ స్థాయిలో ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌వ‌చ్చు అని ఈ శాస్త్ర‌వేత్త‌లు నిరూపించారు.కంప్యూట‌ర్ మైక్రోచిప్స్‌లో ఉండే ట్రాన్‌సిస్ట‌ర్స్ ఆధారంగా క్వాంట‌మ్ టెక్నాల‌జీ ఎంత ప్ర‌భావిత‌మైందో అర్థం చేసుకోవ‌చ్చు. రాబోయే త‌రాల‌కు చెందిన క్వాంట‌మ్ టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ చేసే రీతిలో ప‌రిశోధ‌న‌లు జ‌రిగిన‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది. క్వాంట‌మ్ క్రిప్టోగ్ర‌ఫీ, క్వాంట‌మ్ కంప్యూట‌ర్స్‌, క్వాంట‌మ్ సెన్సార్స్ అంశాల్లో శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని క‌మిటీ తెలిపింది.