న్యూ డిల్లీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవలే పలు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించడం ఇటీవలే కలకలం రేపుతోంది. ట్రంప్ కుడిచేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్క్ కనిపించింది. సోమవారం ఓవెల్ ఆఫీస్ లో జరిగిన సమావేశం సందర్భంగా అది కెమెరాకు చిక్కింది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన రేకెత్తించింది. ఇది చూసిన ట్రంప్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక అనారోగ్యం వార్తల వేళ ట్రంప్ ‘అదృశ్యం’ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఏది చెప్పాలన్నా నిమిషాల్లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యే అధ్యక్షుడు.. రెండు రోజులుగా బాహ్యప్రపంచానికి కనిపించట్లేదు ఎలాంటి మీడియా సమావేశాలనూ నిర్వహించట్లేదు. వారాంతంలో కూడా పబ్లిక్ ఈవెంట్లు వైట్‌హౌస్ షెడ్యూల్‌లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ‘అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమైంది..? ఆయన ఎక్కడ ఉన్నారు..? అసలు ఏం జరుగుతోంది?’ వంటి పోస్టులు నెట్టింట దర్శనమిస్తున్నాయి. కొందరు ‘ట్రంప్ చనిపోతే’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఎక్స్‌లో TRUMP IS DEAD ట్రెండింగ్‌లో ఉంది.