రచయిత నండూరి రామ్మోహన్ రావుకు 14వ వర్ధంతి సందర్భంగా నివాళి

Facebook
X
LinkedIn

తెలంగాణా ప్రజా సాంస్కృతిక కేంద్రం స్పూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో

హైదరాబాద్ :

తెలంగాణా ప్రజా సాంస్కృతిక కేంద్రం స్పూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో 3 9 2025 ఉదయం 11 గంటలకు కమలానగర్ ఆఫీసులో ప్రముఖ వైజ్ఞానిక సామాజిక రచయిత నండూరి రామ్మోహన్ రావు 14వ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. తెలుగు పండిట్ విద్వాన్ లక్ష్మయ్య నండూరి రామ్మోహన్ రావు గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్ఫూర్తి గ్రూపు సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నండూరు రామ్మోహన్ రావు గారు పలు పత్రికలకు ఎడిటర్ గా పని చేశారు. అంతేకాకుండా తాత్విక విషయాల మీద విజ్ఞానపరమైన అంశాల మీద పలు గ్రంధాలు రాసారని చెప్పారు. విశ్వ దర్శిని తాత్వికచింతనతో రాసిన గొప్ప పుస్తకం అని అన్నారు అంతేకాకుండా మానవ పరిణామ క్రమాన్ని గొప్పగా చర్చించి విజ్ఞాన బండాగరాన్ని అందించారని చెప్పారు. అంతేకాకుండా విశ్వరూపం విశ్వ పరిణామ క్రమాన్ని ఎంతో గొప్పగా వివరించారని అన్నారు. విజ్ఞాన పరమైన పుస్తకాలను ఆయన రాసిన విధంగా ఎవరు అంత గొప్పగా ప్రయత్నించలేదని అది ఎంతో ప్రామాణిక గ్రంథాలుగా మిగిలిపోయాయని చెప్పారు. ఆయన చేసిన కృషిని విశదీకరించి ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మయ్య గారు, గొడుగు యాదగిరిరావు, జయరాజ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం సభ్యులందరూ నండూరు రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాస్, ఉన్నికిష్ణన్, గౌస్య, జయరాజ్, జే రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.