ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో

Facebook
X
LinkedIn

తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నీరుకొండ సతీష్‌బాబు

హైదరాబాద్ :

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నీరుకొండ సతీష్‌బాబు చురుగ్గా పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని డాక్టర్ ఏఎస్‌రావు నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, హాన్స్ అవెన్యూ కాలనీ, విరాట్‌నగర్ కాలనీ, పరిమళనగర్ కాలనీ, మార్కండేయనగర్ కాలనీ, సుభాష్ చంద్రనగర్ కాలనీలలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు.

పోలింగ్ కేంద్రం (బూత్) నంబర్-76 పరిధిలో బీఎల్‌వో శ్యామ్‌కుమార్‌తో కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఓటర్ల వివరాల పరిశీలన, సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా సతీష్‌బాబు మాట్లాడుతూ, కాలనీల్లో నివాసం మారినప్పటికీ పాత చిరునామాల వద్దే ఓటు నమోదై ఉండే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఓటు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ప్రతి ఓటరు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.

ఈసీఐనెట్ (ECINET) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ ఓటు ఏ బూత్‌లో నమోదై ఉందో తెలుసుకోవాలని, అవసరమైతే సంబంధిత బీఎల్‌వోను సంప్రదించి వివరాలు సరిచేసుకోవాలని ఆయన కోరారు. ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.