చర్లపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

Facebook
X
LinkedIn

చర్లపల్లి, :
నవోదయ సంక్షేమ వేదిక, రెనోవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చర్లపల్లిలోని భారతి పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

శిబిరంలో కంటి, దంత, జనరల్ ఫిజీషియన్, ఫిజియోథెరపీ, హోమియో, వెల్‌నెస్ సేవలతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మొత్తం 30 మంది కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. 150 మందికి కంటి పరీక్షలు, 140 మందికి దంత పరీక్షలు, 150 మందికి షుగర్, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. హోమియో వైద్యులు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

కార్యక్రమంలో బీపీసీఎల్ హైదరాబాద్ టెరిటరీ మేనేజర్ (ఎల్‌పీజీ) అరుముగసామి ప్రభాకర్, చర్లపల్లి ప్లాంట్ మేనేజర్ (ఎల్‌పీజీ) లోకేంద్ర చంద్ర, చీఫ్ మేనేజర్ (ఆపరేషన్స్) డా. మకరంద్ నందన్‌వార్, ఎగ్జిక్యూటివ్ (హెచ్‌ఎస్‌ఎస్‌ఈ) స్వప్నశిష్ గుప్తా, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) నితిన్ కోలి పాల్గొన్నారు.

ఈ మెగా వైద్య శిబిరాన్ని నవోదయ సంక్షేమ వేదిక అధ్యక్షురాలు ఎం. శ్రీదేవి, రెనోవా ఫౌండేషన్ డైరెక్టర్ డి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. శిబిరం నిర్వహణకు అనుమతి ఇచ్చిన బీపీసీఎల్ అధికారులకు రెట్టినోవా ఫౌండేషన్, నవోదయ సంక్షేమ వేదిక నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.