ఇంగ్లాండ్ వీసా ఫీజులు పెంపు

Facebook
X
LinkedIn

ఏప్రిల్‌ 8 నుంచి అమలు… విద్యార్థులు, ఉద్యోగార్థులపై భారం

హైదరాబాద్‌: ఇంగ్లాండ్ ప్రభుత్వం అన్ని రకాల వీసా ఫీజులను గణనీయంగా పెంచింది. వీసా, సెటిల్మెంట్‌, స్పాన్సర్‌ లైసెన్స్‌కు సంబంధించిన కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు హోమ్‌ ఆఫీస్‌ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు రుసుములు సుమారు 6 నుంచి 7 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.

వీసా ఫీజుల పెంపుతో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా యుకేలో చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారి ఖర్చులు మరింత పెరగనున్నాయి.

ఫీజుల వివరాలు

  • విద్యార్థి వీసా: 524 పౌండ్లు → 558 పౌండ్లు (రూ.69,814)
  • 6 నెలల విజిటర్‌ వీసా: 127 పౌండ్లు → 135 పౌండ్లు (రూ.16,890)
  • కార్మిక వీసా: 769 పౌండ్లు → 819 పౌండ్లు (రూ.1,02,470)
  • 3 ఏళ్లకు పైగా వీసా: 1519 పౌండ్లు → 1618 పౌండ్లు (రూ.2,02,437)

  • విదేశీ విద్యార్థులకు ఖర్చులు పెరుగుతాయి
  • ఉద్యోగాల కోసం వెళ్లే వారికి అదనపు భారం
  • వీసా ప్రణాళికలు వేసుకునే వారు ముందుగానే ఆర్థిక ప్రణాళిక అవసరం