కొత్త వ్యూహాలతో కేసీఆర్

Facebook
X
LinkedIn

రేవంత్ ప్రభుత్వంపై దూకుడు… ఎర్రవెల్లిలో కీలక భేటీ

హైదరాబాద్:

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ రాజకీయంగా చురుకుగా మారుతూ, రేవంత్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహాలతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా నీటి వాటాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చించి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

అదేవిధంగా ఈ అంశంపై పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించడంపై దృష్టి సారించనున్నారు. బహిరంగ సభల నిర్వహణ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించే అవకాశమున్నట్లు సమాచారం.