‘నన్ను కాపాడేవాళ్లు ఎవరూ లేరు’: రేణూ దేశాయ్ సంచలన కామెంట్స్

Facebook
X
LinkedIn

 హైదరాబాద్ :

వీధి కుక్కలను చంపడంపై నటి రేణ్ చేశాయ్ అధికారులుపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆమెను కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. తనని కాపాడేందుకు ఎవరూ లేరని.. ఆమె పోస్ట్ పెట్టారు. ‘‘నన్ను కాపాడటానికి అమ్మా నాన్న, అన్నయ్య, భర్త ఎవరూ లేరు. తాజా అంశంపై నా తప్పు లేకున్నా ఎంతో మంది నన్ను విమర్శస్తున్నారు. మీరు చేసే వ్యాఖ్యలపై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మా్రమే నా బాధను చెబుతాను. ఆయన నా ప్రార్థనలు వింటాడన్న నమ్మకం నాకు ఉంది. నేను తరచూ కాశీకి ఎందుకు వెళ్తానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది’’ అని రేణు రాసుకొచ్చారు.