ఎముకలు కొరికేలా చలి తీవ్రత..

Facebook
X
LinkedIn

హైదరాబాద్ లో గణనీయంగా పడిపోయిన సాధారణ ఉష్ణోగ్రతలు

మొయినాబాద్ శివార్లలో 5.4° సెంటీ గ్రేడ్ ,శెరిలింగం పల్లి ,ఇబ్రహీంపట్నంలో 6.3° సెంటీ గ్రేడ్ నమోదు

హైదరాబాద్ :

భాగ్యనగరంలో చలి వణికిస్తోంది, ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. హైదరాబాద్ లో సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెల్లవారుజామున బయటక రావాలంటే భయం వేస్తోంది. నీళ్లను ముట్టుకుంటే చాలు కరిచేస్తున్నాయి. జనం చలితో వణికిపోతున్నారు. శుక్రవారం ఉదయం జిహెచ్ఎంసి పరిధిలోని ప్రాంతాలలో 12 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారులో శెరిలింగం పల్లి 6.3° సెంటీ గ్రేడ్, మొయినాబాద్ వంటి శివార్లలో 5.4° సెంటీ గ్రేడ్ ఇబ్రహీంపట్నంలో 6.3° సెంటీ గ్రేడ్ నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. పొగ మంచు, శీతల గాలుల కారణంగా రాత్రి పూట చలి ఎక్కువగా ఉంటుందని, రానున్న మూడు రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రాత్రి కంటే ఉదయం 4 గంటల ప్రాంతంలో చలి ఎక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తుందని, వాతావరణ శాఖ వెల్లడించింది.