సుమారు 4 కోట్ల నగదును స్వాధీనం
భువనేశ్వర్ :
ఒడిశాలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. ఒడిశా విజిజెన్స్ చేపట్టిన ట్రాప్ ఆపరేషన్.. భారీగా నగదును పట్టించింది. కటక్ సర్కిల్లోని మైన్స్ శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మోహంతి ఇంట్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ శాఖ షాక్కు గురైంది. ఆ ఇంటి నుంచి సుమారు 4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లో ఉన్న అతని ఫ్లాట్ నుంచి బుధవారం ఉదయం ఆ డబ్బును సీజ్ చేశారు. వాస్తవానికి మోహంతిని మంగళవారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఓ బొగ్గు వ్యాపారి లైసెన్స్ కోసం అతను 30 వేల లంచం తీసుకున్నాడు.ఆ క్రమంలో అతన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే అతనికి చెందిన పలు లొకేషన్లలో అధికారులు సోదాలు చేపట్టారు.పాటియాలోని శ్రీవిహార్లో ఉన్న నేచర్ క్రెస్ట్ అపార్ట్మెంట్తో పాటు భద్రక్ జిల్లాలో ఉన్న మాతసాహి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ నుంచి కళ్లు చెదిరే రీతిలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగులు, అల్మిరాల్లో ఆ డబ్బును దాచినట్లు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. నిందిత ఆఫీసర్ రూమ్లో నుంచి రెండు లక్షల నగదు సీజ్ చేశారు. భువనేశ్వర్లో ఉన్న పహలాలోని రెండు అంతస్తుల బిల్డింగ్ తో పాటు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.