కవి సహజ దార్శనికుడు

Facebook
X
LinkedIn

‘చెమక్కులు- తలకులు’ పుస్తకావిష్కరణ సభ లో డాక్టర్ వై కృష్ణ రామకృష్ణారావు

హైదరాబాద్ :

ప్రపంచ సాహిత్యం పలుమార్పులతో భిన్న ప్రక్రియలతో అలరాడుతోందని అందులో తెలుగువారి పాత్ర విశిష్టమైనదని ప్రముఖ కవి వై రామకృష్ణ రావు అన్నారు. శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్, త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత తిరుమల వెంకటస్వామి( టీవీ స్వామి) రచించిన చెమక్కులు తలకులు పుస్తకావిష్కరణ సభ త్యాగరాయ గాణసభ లోని హనుమంతరావు కళావేదికలో ఘనంగా జరిగింది. ఆకాశవాణి విశ్రాంత ఇప్పటి డైరెక్టర్ సి ఎస్ రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై ‘చెమక్కులు- తలకులు’ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు తిరుమలా వెంకటస్వామి సమాజాన్ని ఆకలింపు చేసుకొని చమత్కారంగా రచనలు చేస్తున్నారని ‘చెమక్కులు- తలకులు’ లో చురుకులు కూడా ఉన్నాయని అన్నారు. గౌరవ అతిథి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టార్ ఆచార్య టి. గౌరీశంకర్ మాట్లాడుతూ ఒక కవి మరొక కవి మిత్రుడికి పుస్తకాన్ని అంకితం ఇవ్వడం ఉత్తమ సంస్కారమని అభినందనీయమని అన్నారు. మంచి పుస్తకాన్ని రచించిన టీవీ స్వామి  అభినందనీయం అన్నారు కృతి అంకిత స్వీకర్త ప్రముఖ కవి ఉమ్మడి సింగు రాఘవరావు(రఘు శ్రీ మాట్లాడుతూ టీవీ స్వామి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన సాహితి మృతి అని స్నేహభావంతో పుస్తకాన్ని అంకితమిచ్చి ప్రతిభను ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సభలో డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ, డాక్టర్ లలిత వాణి, కడియాల ప్రభాకర్, జయసూర్య గ్రంథకర్త ప్రసంగించారు. ఈ సందర్భంగా  రంగకర్త టీవీ స్వామి అతిథులను సాంప్రదాయ బద్దంగా ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి ముందు జరిగిన కవి సమ్మేళనంలో పలు వరకు కవులు స్వీయ కవిత గానం చేశారు.మానస థియేటర్ అధ్యక్షులు బండారుపల్లి రామచంద్రారావు కన్వీనర్ కోక భవాని సభా సామాన్యం సమన్యయం కావించారు.