బాసర ట్రిబుల్‌ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!

Facebook
X
LinkedIn

ఆదిలాబాద్‌  :

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదించబడింది. రేవంత్ రెడ్డి పాలనలో విద్యాలయాలు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మృతురాలిది స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా బైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘటన విద్యార్థి సంఘాలతో పాటు, తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. పూర్తి నివేదిక మరియు అధికారిక ప్రకటనల కోసం టీవీ9 కథనాన్ని వీక్షించాల్సిందిగా కోరడమైనది. ఈ దుర్ఘటన బాసర క్యాంపస్‌లో భద్రత మరియు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థుల భద్రత, శ్రేయస్సు పట్ల కళాశాల యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రేమ విషయమే కారణమా..?

వసంత ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడం కారణమని వైరల్ అవుతోంది. ఆమె గణేష్ అనే యువకుడ్ని ప్రేమిస్తోందని, ఆ యువకుడు తన స్వగ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. అంతకుముందు తన ఫోన్, వాట్సాప్ లో వసంత నెంబర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వసంత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చెబుతున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకు రానున్నాయి.

ఆదిలాబాద్‌ ఫిబ్రవరి 25 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );  : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదించబడింది. రేవంత్ రెడ్డి పాలనలో విద్యాలయాలు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మృతురాలిది స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా బైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘటన విద్యార్థి సంఘాలతో పాటు, తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. పూర్తి నివేదిక మరియు అధికారిక ప్రకటనల కోసం టీవీ9 కథనాన్ని వీక్షించాల్సిందిగా కోరడమైనది. ఈ దుర్ఘటన బాసర క్యాంపస్‌లో భద్రత మరియు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థుల భద్రత, శ్రేయస్సు పట్ల కళాశాల యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రేమ విషయమే కారణమా..?

వసంత ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడం కారణమని వైరల్ అవుతోంది. ఆమె గణేష్ అనే యువకుడ్ని ప్రేమిస్తోందని, ఆ యువకుడు తన స్వగ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. అంతకుముందు తన ఫోన్, వాట్సాప్ లో వసంత నెంబర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వసంత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చెబుతున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకు రానున్నాయి.