గ్రామపంచాయతీ ఎన్నికలలో కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం

Facebook
X
LinkedIn

నిప్పులు చెరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య

*రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దిగ్బంగం,రాస్తారోకో,నిరసనలకు పిలుపు

హైదరాబాద్ : 

గ్రామపంచాయతీ ఎన్నికలలో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 తగ్గించి బీసీల గొంతు కోశారని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే ఇంకొక వైపు చాలా జిల్లాలో కేటాయించిన 22 శాతం కూడా అమలు చేయడం లేదని  ఇది బి.సి.లను నట్టేట ముంచడమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు.మంగళవారం  బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగర్కర్నూల్ జిల్లాలో 460 సర్పంచ్ పదవుల్లో బీసీలకు 83 మాత్రమే బి.సి.లకు కేటాయించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 31 గ్రామ పంచాయితీల్లో ఒక సర్పంచ్ కూడా బీసీలకు దక్కని వైనం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గ్రామా పంచాయితీ 473లలో బి.సి.లకు 23 మాత్రమే కేటాయించిన కేవలం 11శాతమే సర్పంచ్ పదవులు కేటాయించి దగా చేసారు. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా 10 శాతం దాటలేదు.పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి శాస్త్రీయత లేకుండా అధికారులు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాను యూనిట్ గా తీసుకొని అధికారులు చేసిన మూలంగా బీసీలకు గతంలో జరిగిన పంచాయితీ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో తీరని తప్పుడు విదానాల జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 42శాతం బీసీ రిజర్వేషన్ల మాట నష్టం దేవుడెరుగు కానీ, ఉన్న బీసీ రిజర్వేషన్లకి ప్రభుత్వం గండికోడుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు బీసీ రిజర్వేషన్లను అతితక్కువగా కేటాయించడం మోసం చేయడం కాదా? 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18 నుంచి 22 శాతం వరకు రిజర్వేషన్లను అమలు చేశారని, తాజా ఎన్నికల్లో 16 నుంచి 20శాతం వరకే రిజర్వేషన్లు కేటాయించారని ఆరోపిం చారు. అనేక డివిజన్లు, మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ సీలు కూడా రిజర్వ్ కాలేదని, మండలాల వారీగా చూస్తే పలు జిల్లాలో అనేక మండలంలో గత ఎన్నికల్లో కన్నా బీసీ కోటాను తగ్గించారు. బీసీ రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోటా రిజర్వేషన్ పెంచారని, బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టే కుట్ర జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అన్ని రిజర్వేషన్ వివరాలను సేకరిస్తున్నాం, అతి త్వరలోనే తమ కార్యవరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 10 జిల్లాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు దక్కలేదు. వివరాలు ఇలా మండలాలు -27 యున్నవి. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, తిరుమలాయపాలెం. నల్గొండ జిల్లాలో దామరచర్ల, నేరేడుగొమ్ము, సూర్యాపేట జిల్లాలోచివ్వెంల, పాలకీడు. మంచిర్యాల జిల్లాలో భీమారం, కాసిపేట, కోటపల్లి, మందమర్రి, నెన్నెల. ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్, మావల, నేరడిగొండ. సాత్నాల, సోనాల, సిరికొండ. భూపాలపల్లి జిల్లాలోమహాముత్తారం, పలిమెల. మహబుబబాద్ జిల్లాలో కేసముద్రం, కురవి, ఇనుగుర్తి, సీరోలు. డోర్నకల్, మరిపెడ. ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్, నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట. రంగారెడ్డి అమనగల్లు లో ఒక్క గ్రామా పంచాయితీ కూడా బి.సి.లకు రిజర్వేషన్ దక్కలేదు.గ్రామాలు (జనాభా ఎక్కువగా ఉండడం, రొటేషన్ పద్ధతిలో కలిసిరావడం వల్ల) రిజర్వ్ కాగా.. కొన్ని మండలాల్లో ఒకటి, రెండు గ్రామాలే దక్కాయి. ఇప్ప టివరకు అందిన వివరాల ప్రకారం 27 మండలా ల్లోనైతే బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానమూ దక్కలేదు. గతంలోనూ ఇదే పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారయ్యా యని, అప్పట్లోనూ బీసీలకు రిజర్వ్ కాని, మండలాలు ఉండేవని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం బీసీ ఉద్యమం బలంగా యున్న బి.సి.లకు అన్యాయం జరిగింది. ఇది సహించరని నేరమన్నారు.నష్టపోకుండా వెంటనే దిదుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.సర్పంచ్ రిజర్వేషన్లను జిల్లాలో యూనిట్ గా కాకుండా మండల యూనిట్ గా తీసుకోవాలి.సీట్లు కేటాయింపులో బీసీలకు జరిగిన అన్యాయం విషయమే తీవ్ర ఆందోళన మొదలైంది. ఇది గమనించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను వెంటనే మొదలుపెట్టాలి.బీసీ రిజర్వేషన్ల కేటాయింపుపై తిరిగి సమయం ఇచ్చి సరైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు.ఈ సమావేశంలో బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బి.సి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, బి.సి ఐక్య వేదిక అధ్యక్షులు అనంతయ్య, రాష్ట్ర బి.సి సంఘం అధ్యకులు రాజేందర్, బి.సి విద్యార్ధి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ళ సతీష్, బి.సి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బానాల అజయ్, బి.సి రాష్ట్ర బి.సి సంక్షేమ సంఘం కార్యదర్శి భీం రాజు,బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు  ఏ.లత , బి.సి విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ శివ కుమార్, అంజి గౌడ్, బి.సి యువజన సంఘం  ప్రెసిడెంట్ వర్కింగ్ తిరుమల గిరి అశోక్, జక్కా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.