జాతీయస్థాయి నాటక పోటీల కళా వేదికకు శంకుస్థాపన

Facebook
X
LinkedIn

తెలుగునాడు, భీమవరం :


భీమవరంలోని డిఎన్నార్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో చైతన్య భారతి, సంగీత నృత్య నాటిక పరిషత్ 18వ జాతీయస్థాయి నాటిక పోటీల కళా వేదికకు గురువారం పరిషత్ సభ్యులు శంకుస్థాపన చేశారు. ఈనెల 24 నుంచి 27వ తేదీల్లో భీమవరంలో చైతన్య భారతి నాటికల పోటీలను నిర్వహిస్తున్నట్లు నాటక పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్ కుమార్ రాజు, పి. ర్. ఓ. భట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. దీనిలో భాగంగానే నేడు వేదిక నిర్మాణానికి గం.9.36 ని.ల ముహూర్తానికి శంకుస్థాపన చేసుకున్నామని, 17 ఏళ్లుగా భీమవరంలో చైతన్య భారతి నాటక పరిషత్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నాటక పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమం లో డి ఎన్. ర్. కళాశాల జాయింట్ సెక్రటరీ కూనపరాజు రామకృష్ణoరాజు, అసిస్టెంట్ సెక్రటరీ బోసురాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాయప్రోలు శ్రీనివాసమూర్తి, వి. హెచ్. పి. ప్రాంతీయ అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరులు, నాటక పరిషత్ సభ్యులు కోశాధికారి బొండా రాంబాబు, కోట్ల నాని,
కె. సత్యకుమర్, పేరిచర్ల లక్ష్మణ వర్మ,పెన్నాడశ్రీను, కనగర్ల రామకృష్ణ,కొణకంచివెంకటరమణమూర్తి, సహాయకార్యదర్శి యమ్.హేమసుందర్,అంగరచిన వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.