వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం
అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉండాలని సీఎం నిర్ణయం
తెలుగునాడు, అమరావతి :
ప్రజారాజధాని అమరావతి రూపకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… రాజధాని ప్రాంతంలో సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. విభజన తరువాత అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు… ఇదే ప్రాంతంలో నివాసం ఉండి పాలన సాగించారు. రాజధాని నిర్మాణం ప్రథమ ప్రాధాన్యంగా భావించిన చంద్రబాబు… 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలపైనే దృష్టిపెట్టారు. ఈ పనుల్లోపడిన చంద్రబాబు నాడు సొంతి ఇంటి గురించి ఎక్కువగా దృష్టిపెట్టలేదు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి రోజు నుంచే అమరావతిపై దృష్టి సారించారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా అమారవతిలో నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలు ఎక్కించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి…. నిర్మాణాలు ప్రారంభించారు. దేశ, విదేశీ సంస్థలను అమరావతికి రప్పించి….ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని తీర్చిదిద్దుతున్నారు.
అమరావతికి సరికొత్త శోభ :
అమరావతి పనులు గాడిన పడడం, మళ్లీ బ్రాండ్ పునరుద్ధరణతో చంద్రబాబు తన సొంతి ఇంటి వ్యవహారంపైనా దృష్టిపెట్టారు. దీని కోసం వెలగపూడి సచివాలయం సచివాలయం వెనక E9 రహదారి పక్కనే భూమి కొనుగోలు చేశారు. నేడు ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి బుధవారం ఉదయం సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ. స్వయంగా సిఎం కూడా ఇదే ప్రాంతంలో సొంతి ఇంటి నిర్మాణం చేపడడంతో…. ఈ ప్రాంతం ప్రజలతో పాటు…. అందరిలో ఒక నమ్మకం, భవిష్యత్‌పై భరోసా కలగనుంది. రాజధాని ఎంపిక నాటినుంచి తరువాత జరిగిన ప్రతి పరిణామంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అమరావతిపై అనేక కుట్రలు జరిగిన సమయంలో…. రాజధాని రైతులకు, ప్రజలకు చంద్రబాబు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు స్వయంగా ఇదే ప్రాంతంలో సొంతిల్లు నిర్మించుకోవడంతో రాజధాని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి కేంద్ర నిధులు, రాజధాని ప్రాంతంలో ప్రముఖ సంస్థల ఏర్పాటు, టెండర్లు పూర్తి చేసుకుని జోరందుకున్న నిర్మాణ పనులతో…. ఈ ప్రాంతం అంతటా ఇప్పుడు ఒక సానుకూల వాతావరణం నెలకొంది. నేడు చంద్రబాబు నివాస పనులతో అమరావతి కొత్త శోభను సంతరించుకుంటోంది.

