కుందారం గణేశాచారికి విశ్వబ్రాహ్మణ జాతిరత్నం నంది అవార్డు ప్రధానం

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :
లెజెండ్ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ తరపున ఆర్గనేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ఉత్సవం బ్యాంకు డాల్ ఎల్బీనగర్ లో సమాజానికి 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న విశ్వబ్రాహ్మణ జాతిరత్నం కుందారం గణేశాచారికి నంది అవార్డు ప్రధానం చేయడం అయినది జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి అమృతస్థాలచే కుందారం గణేష్ చారి కి నంది అవార్డు ప్రధాన చేయబడినది ఎన్టీ రామారావు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు దాదాపు పదిమంది ముఖ్యమంత్రిలతో విశ్వబ్రాహ్మణుల సమస్యలపై మరియు బీసీ సమస్యలపై గల్లి నుంచి ఢిల్లీ వరకు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్న గణేష్ చారి గారిని నంది అవార్డుతో సన్మానించడం అయినది ఎన్నో రోజులుగా భారత ప్రధాని రాష్ట్రపతి కేంద్ర మంత్రులతో సమస్యలపై పోరాడుతున్న గణేష్ చారి గారికి ఈ అవార్డు ప్రధానం చేయబడినది శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గణేష్ సేవలు గుర్తించి రాష్ట్రపతి అవార్డు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేరు సంఘం భాస్కర్ సతీష్ చారి విజయ్ నాయక్ రాజు శ్యామల విమల లక్ష్మి వరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎరుగని పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది హాజరైన్నారు.