క్షయ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం

Facebook
X
LinkedIn

క్షయ వ్యాధి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంది .

నవజాత శిశు మరణాలను తగ్గించటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాం .

మాతశిశు సంరక్షణకు కృషి.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి J P నడ్డా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.

హైదరాబాద్:

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా దేశంలో క్షయ, మాతశిశు సంరక్షణ, నివారణ కార్యక్రమాలపై అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం సమావేశమందిరం నుండి పాల్గొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో క్షయ నిర్ధారణ పరీక్షలు (ఎక్స్ రే, తెమడ పరీక్షలు) అనుమానితులందరికీ నిర్వహించాలని కేంద్ర మంత్రి J P నడ్డా ఈ కాన్ఫరెన్స్ లో తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను తెలంగాణ రాష్ట్రంలో 2492 గ్రామాలలో హెల్త్ స్క్రీనింగ్ లను నిర్వహిస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు .

క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలలో వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స తో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు నిక్షయ పోషణ యోజన పథకం కింద అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి J P నడ్డా గారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో పౌష్టికాహారం కోసం Food Basket లను బాధితులకు అందిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలలో భాగంగా మాతృమరణాలను, నవజాత శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యం తో చర్యలు చేపట్టామన్నారు. RBSK బృందాల ద్వారా 0- 18 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి నడ్డా కి మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు వివరించారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలలో భాగంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ లను ముందే గుర్తించి గర్భిణీ స్త్రీలకు బర్త్ ప్లానింగ్ కోసం కావాల్సిన సదుపాయాలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచామని మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. రాష్ట్రం లో Anti Natal Checkup (ANP) లను విధిగా 4 సార్లు నిర్వహిస్తున్నామన్నారు. జన్యుపరమైన రుగ్మతలు (సికిల్ సెల్, తలసేమియా) ముందుగానే గుర్తించటానికి హెల్త్ చెక్ అప్ చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ లో తెలియజేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ లాంటి వాటిని గుర్తించటానికి హెల్త్ స్క్రీనింగ్, హెల్త్ చెక్ అప్, ట్రీట్మెంట్ చేస్తున్నామన్నారు. నవజాత శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యం గా కృషి చేస్తున్నామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డా. సంగీత సత్యనారాయణ, TB కంట్రోల్ JD రాజేశం లు పాల్గొన్నారు.