తెలంగాణలో ఇంధన కొరత  ఉందని తప్పుడు వార్తలు నమ్మొద్దు

Facebook
X
LinkedIn

           తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్

హైదరాబాద్‌ :

తెలంగాణలో ఇంధన కొరత  ఉందని తప్పుడు వార్తలు నమ్మొద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేశారు. అవాస్తవ ప్రచారాల వల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌ ( HPCL) , ఐవోసీఎల్‌ ( IOCL ), బీపీసీఎల్‌ ( BPCL) వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపారు.రాష్ట్ర వార్తలుసరఫరా గొలుసు  ఎక్కడా ఆగలేదని, భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని వివరించారు. దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు. కానీ అది కొరత కాదని, పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం పీఈఎస్‌వో   నిబంధనలకు విరుద్ధమని అన్నారు.ఇటువంటి చర్యలు చాలా ప్రమాదకరమని, అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.