నన్ను బుజ్జగించలేదు… ఇలా వచ్చి అలా వెళ్తున్నారు అంతే: జీవన్ రెడ్డి

Facebook
X
LinkedIn

 జగిత్యాల :

తనది పూలబాట కాదు.. ముళ్లబాట అని ఎంఎల్ సి జీవన్ రెడ్డి తెలిపారు. తనకు పిసిసి చీఫ్ పదవి రాకుండా చేసినా బాధపడలేదని అన్నారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం తనను బుజ్జగించలేదని, కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్తున్నానని తెలిసి..ఇలా వచ్చి అలా వెళ్లారని జీవన్ రెడ్డి చురకలంటించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డానని, రేవంత్ రెడ్డి కు పిసిసి చీఫ్, సిఎం భట్టి విక్రమార్కకి సిఎల్ పి లీడర్, డిప్యూటీ సిఎం ఇచ్చారని తెలియజేశారు. మరి తాను మండలి నేతను కాదా? తనకెందుకు అన్యాయం చేశారు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తన పదేళ్ల ఒంటరి పోరును అధిష్టానం చిన్నచూపు చూసిందని, పార్టీ ఫిరాయింపుల్లో మనకు మాజీ సిఎం కెసిఆర్ ఆదర్శం కాదు కదా? అని.. అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు ఏంటి? మనం చేస్తున్నదేంటీ? అని..కెసి వేణుగోపాల్ వంటి నేత ఇచ్చిన హామీ అమలు కాకపోతే పార్టీ ఎందుకు? అని.. ప్రశ్నించారు.