కొడంగల్ :
విద్యార్థి దశలో అత్యంత కీలకమైన మలుపు పదవ తరగతి. పరీక్షల్లో ప్రతిభను చూపాలని తపన విద్యార్థులలో ఉండాలి. చదువుతున్న సబ్జెక్టు పై పూర్తిస్థాయి పట్టు సాధించాలి .ఇక్కడి నుంచే ప్రతి ఒక్కరి భావి ప్రణాళికలు మొదలవుతాయి. తుది పరీక్షల ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. దీన్ని జయించలేక కొందరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి బారిన పడకుండా సునాయాసంగా పదో తరగతి ఉత్తీర్ణుల అవ్వాలంటే ముందస్తు ప్రణాళికతో సన్నద్ధం కావాలి. ప్రాథమిక అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించినట్లయితే విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురికారు. ఆందోళన చెందకుండా విషయాలు పై పట్టు సాధించేందుకు ఏకాగ్రతతో చదువుపై దృష్టి సాధించాలి. ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేమున్నామనే భరోసా అందించాలని కొడంగల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు
పరీక్షల తర్ఫీదుకు కొన్ని ముఖ్య సూత్రాలు:
పరీక్షలను ఒక పండగల భావించాలి. మీలోని ప్రతిభను వెలికి తీయటమే అన్ని పరీక్షల లక్ష్యం అనేది గుర్తించాలి. వివేకానందుని బోధలను అనుసరించాలి. పరీక్షలకు ముందు బెరుకు సహజము. మనో ధైర్యము పెంచుకోవడం ద్వారా ఈ సమస్యను మీరు గమించవచ్చు. మనో నిబ్బరము, పరీక్షల నుంచి మీ దృష్టిని మల్లిస్తున్న అంశాలను గుర్తించి, తొలగించుకుంటే సరిపోతుంది. యోగా, మీ బుద్ధి, మనసు, దేహాలను ఏకోన్ముఖం చేసి మీ కేంద్రీకరణ శక్తిని పెంచుతుంది. మీ ప్రత్యర్థిని మీలోనే కనుగొనండి. మీ తల్లిదండ్రుల ఉద్దేశాలను ప్రశ్నించకండి. ప్రకృతితో గడపండి. మంచి పుస్తకాలు చదవండి. మీకు ఇష్టమైన పనులు చేయండి అని కొడంగల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు
బద్దకాన్ని వీడాలి:
బద్దకాన్ని, వాయిదా తత్వాన్ని వీడి చదువు పైన పూర్తి దృష్టి సాధించండి. కాలం విలువైనది. పరీక్షా సమయాలలో ప్రతిక్షణం కీలకమైనది. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి కఠినమైన విషయాలను చదువుకుంటే బాగా అవగతం అవుతాయి. బాగా చదువుకోవడానికి ఏకువజాము సమయము అత్యంత అనుకూలము. చదువుకునే గది, వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. చదివే తప్పుడు సృష్టి మరలితే విలువైన సమయము వృధా అవుతుంది. చదువుకు ఆటంకం కలిగించే అంశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వాదనలు, ఘర్షణలకు దిగవద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి అని లిల్లీ మేరి పేర్కొన్నారు.
ఆత్మవిశ్వాసమే ఆయుధం:
ఆత్మవిశ్వాసమే లక్ష్యసాధనకు ప్రధాన ఆయుధం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితుల సూచనలు ప్రణాళికా భద్ద ప్రిపరేషన్కు దోహదపడతాయి. భయాన్ని వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లోకి వెళ్ళగలిగితే సగం విజయం సాధించినట్టే. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒత్తిడికి గురికాకుండా పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం తీసుకోగానే క్షుణ్ణంగా చదివి వెంటనే ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. బాగా వచ్చిన ప్రశ్నలు, కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు, రాని ప్రశ్నలను గుర్తించి మొదటగా బాగా వచ్చిన ప్రశ్నలనే రాయాలి. తరవాత కొద్దిగా లోపంతో వచ్చిన ప్రశ్నలు, ఆ తరువాత మిగతా వాటి గురించి ఆలోచించాలి. సమయాన్ని గమనిస్తూ అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగలిగేలా జాగ్రత్త పడాలని డాక్టర్ లిల్లీ మేరి అన్నారు
చేతి రాత బాగుండాలి:
సరళమైన ఆకట్టుకునే చేతిరాతతో ఎగ్జామినర్ లను ఆకట్టుకోవచ్చు. చేతిరాత కనీసం చదివేందుకు వీలుగా ఉండాలి. ప్రశ్నలకు సంబంధించిన జవాబులను సరైన హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ పెట్టి పాయింట్ వైజ్ గా రాయాలి. ప్రధానాంశాలను అండర్లైన్ చేయాలి. కాగితంపై ఒత్తిపెట్టి రాయవద్దు. పరీక్ష రోజే కొత్త పెన్ను వాడవద్దు. రెండు రోజుల ముందుగానే ఆ పెన్నుతో రాస్తూ అలవాటు చేసుకోవాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు తల్లిదండ్రులకు సూచన:
సామాజిక హోదాకు మీ పిల్లల విజయాలను కొలమానం చేయవద్దు. ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది దానిని గుర్తించండి. మార్కులే జీవితము కాదు. దాని కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురాకండి. ఇతరుల పిల్లలతో మీ వాడికి పోలికలు తీసుకురావద్దు అని కొడంగల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లిల్లీ మేరి తన అభిప్రాయాలను వెలిబుచ్చారు









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.