మనువాదo పై మహిళలు తిరగబడాలి

Facebook
X
LinkedIn

సంగారెడ్డి :

మనువాద సంసృతి పై మహిళా లోకం తిరగబడాలని  పిఓడబ్లువిముక్తి జాతీయ ప్రసిడెంట్ సంపంగి పద్మక్క 116 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభలో పిలుపు నిచ్చారు సోమవారం  సంగారెడ్డి జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణం లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్,బీజేపీ విధానాలపై పోరాటం చెయ్యడం ద్వారా మహిళా ల సమానత్వం సాధించాలని కోరారు , మహిళా లు ఆత్మ గౌరవంతో జీవించాలన్న , అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిని రగిలించాలన్నారు, భారత్ లో మనువాదo వేల ఏండ్లుగా మహిళా లను మనిషిగా చూడలేదన్నారు, ఒక వస్తువుగా,ఒక బానిసగా చేసిందన్నారు, కేవలం వంటింటి కుందేలుగా పిల్లల ను కానే సాధనంగా చూసి సమాజంలో తేలే తుకుని బతికే సమానత్వం హక్కు కల్పించలేకపోయింది అన్నారు,భారత రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు పెట్టీ మహిళా సమానత్వ హక్కుల కోసం పోరాడారు అని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై 250 రెట్లు హింస పెరిగిందన్నారు, వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.లైంగిక దాడులకు పాల్పడిన వారిని బీజేపీ సత్కరిస్తున్నది విమర్శించారు, మనువాద సంసృతి కీ వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వం కోసం , ఇ బ్రాహ్మణీయ,మనువాద, సంసృతి కీ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు,పిఓడబ్లు విముక్తి సంగారెడ్డి జిల్లా కార్యదర్శి భాగ్య మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్ర o లొ దళితులు మహిళా లపై జరుగుతున్న హింస ను అరికట్టడంలో పూర్తిగా విఫలమైనారు అని మo డీ పడ్డారు, ఇ కార్యక్రమంలో సిపిఐ( ఎమ్ ఎల్) చండ్ర పుల్లా రెడ్డి పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యులు సంగన్న, సుజాత, రమేష్,మోహన్, తదితరులు పాల్గొన్నారు