గ్రామ సర్వేయర్ల కు ప్రభుత్వం ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేయాలి

Facebook
X
LinkedIn

విజయవాడ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతలో పరిగణించాల్సిన అవసరం ఉందని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యకుడు సిద్ధంరెడ్డి శివశంకర్ రెడ్డి. పేర్కొన్నారు.రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ, రీ-సర్వే ప్రక్రియ, ప్రజల భూమి సమస్యల పరిష్కారం వంటి కలక బాధ్యతలను గ్రామ సర్వేయర్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వేలాది గ్రామ సర్వేయర్లు భూ పరిపాలన వ్యవస్థను సమర్థంగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికి, వారి న్యాయమైన డిమాండ్లు ఇంకా పరిష్కారం కాని పరిస్థితి కొనసాగడం ఆందోళనకరమన్నారు.30.01.2026న   రెవెన్యూ మంత్రి   అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ సర్వేయర్లకు స్వర్ణ గ్రామ సచివాలయ వ్యవస్థలోని ఇతర ఉద్యోగులతో సమానంగా ప్రాథమిక వేతనం కల్పించడం, పదోన్నతి మార్గాన్ని స్పష్టంగా ఏర్పాటు చేయడం మరియు సేవా సంబంధిత అంశాలపై సమగ్ర నివేదికను 15.02.2026లోపు సిద్ధం చేయడం వంటి హామీలు ఇవ్వబడినట్లు వెల్లడైంది.అయితే, పేర్కొన్న గడువు ముగిసినప్పటికి ఆ హామిల అమలుపై స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం విచారకరం. గ్రామ సర్వేయర్లు తమ సేవలను కొనసాగిస్తూ ఉన్నప్పటికీ, వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల అసంతృప్తి పెరుగుతున్నది.  ప్రభుత్వం ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేసి గ్రామ సర్వేయర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 30.01.2026 సమావేశంలో ఇచ్చిన కమిట్మెంట్లను గౌరవిస్తూ, ప్రాథమిక వేతనం, పదోన్నతి విధానం మరియు సేవా అంశాలపై తక్షణమే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసి అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.గ్రామ సర్వేయర్లు చేస్తున్న డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ వారి వక్షాన నిలబడుతుందని సిద్ధంరెడ్డి శివశంకర్ రెడ్డి   స్పష్టం చేశారు.