చిలుక నగర్ మోడల్ గ్రేవ్ యార్డ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోండి : ఎమ్మెల్యే బండారి

Facebook
X
LinkedIn

ఉప్పల్ :

ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్లోని మోడల్ గ్రేవీ యార్డ్ కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాధిక గుప్తా గారితో మాట్లాడుతూ చిలుకానగర్ మోడల్ గ్రేవ్ యార్డ్ కి 2 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ కావడం జరిగిందని కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి సుమారు సంవత్సరం నర సమయం గడిచిన ఇంకా పనులు పూర్తి కాలేదని కాంట్రాక్టర్ కి ఆరు నెలల సమయంలో పని పూర్తి చేయాలని వర్క్ ఆర్డర్ ఉన్నా కూడా సంవత్సరం నర కాలంలో కూడా పనులు పూర్తి చేపట్టకపోగా పార్ట్ పేమెంట్ బిల్ పొందిన కూడా పనుల జాప్యం జరుగుతుందని జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు మూడు నోటీసులు ఇచ్చిన పట్టించుకోకుండా పనులు చేపట్టడం లేదని వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని వేరే కాంట్రాక్టర్ తో గ్రేవీ పనులు పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి గ్రేవి యార్డ్ ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ గారికి తెలపడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ రాధిక గుప్తా వెంటనే జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసి కాంట్రాక్టర్ తో వెంటనే పనులు పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించడం జరిగింది.

కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు ఎదుల కొండల్ రెడ్డి ,జల్లి మోహన్, కోకొండ జగన్, ముద్దం శ్రీనివాస్ యాదవ్, బంటి, శ్యామ్ ,బాలు మొదలగువారు పాల్గొన్నారు.