ఉప్పల్ ఎమ్మెల్యేను కలిసిన కాప్రా ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు

Facebook
X
LinkedIn

ఉప్పల్ :

నూతనంగా ఎన్నికైన కాప్రా ప్రింట్ మీడియా ప్రధాన పత్రికల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. పాత్రికేయుల అభ్యున్నతికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు… ఇబ్బందులను ఎప్పటికప్పుడు వెలికి తీసి జర్నలిజం విలువలను పెంచేలా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లయన్ వడ్లోజు జ్యోతిర్మయా చారి, ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కోశాధికారి వట్టిపల్లి సురేష్, ఉపాధ్యక్షులు పలుగుల పవన్, లక్కిడి బాల్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డమీది బాలరాజు గౌడ్, కార్యదర్శి రోజా రాణి తో పాటుగా క్లబ్ సలహాదారులు, కమిటీ ప్రతినిధులు చంద్రమౌళి, కేసీ మోహన్, క్యాసాని సత్యనారాయణ, కడియాల రమేష్, శ్రీనివాసరావు, ఉల్లోజు శ్రీనివాస్, వేముల శంకర్, సహదేవా చారి, నర్సింగ్ గౌడ్, గుమ్మడి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.