రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు కేంద్ర ప్రభుత్వం చికిత్స నిమిత్తం రూ. 1,50,000లు

Facebook
X
LinkedIn

బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వ్యక్తులకు 25వేల సహాయం

                 రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్

పెద్దపల్లి :

రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు కేంద్ర ప్రభుత్వం చికిత్స నిమిత్తం రూ. 1,50,000 వైద్య ఖర్చులతో పాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వ్యక్తులకు 25వేల సహాయాన్ని అందిస్తుందని రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో లారీలు, స్కూల్ బస్సులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అవసరమైన వారికి అద్దాలను ఎసిపి పంపిణీ చేశారు. అంతేకాకుండా బిపి, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన మందులను అందించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రిలో అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు నియంత్రణలోకి వస్తాయని తెలియజేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో వారం రోజులపాటు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకారం అందరూ హెల్మెట్ ధరించడంతో పాటు తద్వారా కుటుంబానికి ఆధారం అవుతారని చెప్పారు.