ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ హత్య కేసు పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ హత్య కేసు   పై సుప్రీం కోర్టు   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్యయ్యారని ఆరోపించింది. డ్రైవర్‌ హత్యకేసులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌  ధర్మాసనం కేసును విచారించింది.అప్పట్లో తప్పుచేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని , డీజీపీ, ఎస్పీలు ఎం చేస్తున్నారని నిలదీసింది. నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నంట్లుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నవంబర్‌ 18లోపు విచారణ పూర్తి చేయాలని ట్రయల్‌ కోర్టులను ఆదేశించింది.కేసు ట్రయల్‌ కోసం హైకోర్టు సీనియర్‌ న్యాయాధికారిని నియమించి రోజువారీ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మార్చి 31లోగా ప్రత్యేక జ్యుడిషియల్‌ అధికారిని నియమించాలని , హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుని ఆటంకాలు సృష్టించవద్దని సూచించింది. తదుపరి దర్యాప్తు చేయడం రాకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని హెచ్చరించింది.