బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ హర్షం
హైదరాబాద్, :
రాష్ట్రంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీసీలు మొత్తంగా 61%కు పైగా గెలవటం పట్ల బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ మరియు సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్క్ష్మి రంగు హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్య జరిగిన పంచాయితీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో కూడా బీసీ అభ్యర్థులు 52.75% గెలిచిన విషయం విదితమే.మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపల్ వార్డులలో బీసీలకు 28.22%, మున్సిపల్ కార్పోరేషన్‌లలో మొత్తం వార్డులలో 35.25% బీసీలకు కేటాయించినా జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచి, మొత్తం మీద 61% గెలవటం బీసీ వర్గాల ప్రజలలో పెరిగిన చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు.రాబోయే జెడ్‌పిటిసి, ఎంపిటిసి, జిహెచ్ఎంసి, కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా బీసీలు అత్యధికంగా గెలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.రాష్ట్రంలో జరిగిన సమగ్ర సర్వేలో బీసీల సంఖ్య 56.33% అని తేలగా, రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా అది ఇంకా కేంద్ర ప్రభుత్వంలో పెడ్డింగ్‌లో ఉండటం, కొందరు కోర్టు కెళ్లి ఈ రిజర్వేషన్ అమలు కాకుండా చేయడం సముచితం కాదు.గత పంచాయతీ ఎన్నికల్లో, ఇప్ప్పుడు జరిగిన పురపాలక ఎన్నికల్లో బీసీలు గెలిచిన స్థానాలను ద ష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు అమలు చేయడానికి అనుమతినివ్వాలని, 9వ షెడ్డ్యూల్‌లో పెట్టాలని, అదేవిధంగా కోర్టుల్లో కేసులు వేసిన వారు కూడా వారి కేసులను ఉపసంహరించి చట్టబద్ధంగా బీసీల రిజర్వేషన్లు సాకారమయ్యే మార్గం సుగమం చేయాలని బీసీ కమిషన్ కోరుకుంటుంది.








Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.